జమ్మికుంటలో నిర్బంధ తనిఖీలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 17, ధర్మపురి:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలోని స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలో గురువారం తెల్లవారుజామున అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక నిర్బంధ తనిఖీలను చేపట్టారు ఇంటింటా తిరుగుతూ అనుమానితుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు సరియైన ధ్రువీకరణ పత్రాలు లేని 73 ద్విచక్ర వాహనాలను గుర్తించి పట్టుకున్నారు ఈ సందర్భంగా కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసమే ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు
తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 8 గంటల వరకు పోలీసులు తనిఖీలు చేయడంతో స్థానికుల్లో ఏమి జరుగుతుందోననే భయందోళన నెలకొంది
తనిఖీల్లో హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి జమ్మికుంట పట్టణ సీఐ రామ్‌చందర్‌రావుతో పాటు మరో ముగ్గురు సీఐలు 12మంది ఎస్సైలు వంద మంది పోలీస్‌ సిబ్బంది తదితరులు పాలుగోన్నట్టు టీ మీడియా కు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube