జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

1
TMedia (Telugu News) :

జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం.

టీ మీడియా డిసెంబర్ 17 బెల్లంపల్లి : జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం 147 వ సారి బెల్లంపల్లి పట్టణం కాంట చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం దాతల కోరిక మేరకు 147 వ సారి అన్నదాన కార్యక్రమం కొరకు దాత కీ.శే. చింత కనక రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు చింత వరలక్ష్మి-రామకృష్ణ (ఆటో డాన్) దంపతులు యాచకులకి, నిరుపేదలు, కూలీలు, చిరువ్యాపారులు, బాటసారులకి ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసారు .

Also Read : ధనుర్మాసం ప్రారంభం.. ఈనెల రోజుల్లో శుభకార్యాలను వాయిదా

ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి కార్యవర్గ సభ్యులు సాంబారి నర్సయ్య, మోటపలుకుల రాజశేఖర్, సింగతి తిరుమల్,గొడిసెల శేఖర్, కొండ రమేష్, నిచ్చకొల గురుస్వామి,అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube