ప్రజల అజెండాను ముందుకు తీసుకువచ్చే “జనం కోసం సిపిఎం”

- సిపియం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు

1
TMedia (Telugu News) :

ప్రజల అజెండాను ముందుకు తీసుకువచ్చే “జనం కోసం సిపిఎం”
– సిపియం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
టీ మీడియా, జూన్ 15,అన్నమయ్య జిల్లా: జనం కోసం సిపిఎం’ అన్న నినాదంతో జూన్‌ నెల మొత్తం సిపియం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలు సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలు అజెండాలోకి తీసుకురావలని  సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం కోడూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం లింగాల యానదయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే, బిజెపి, టిడిపి, వైసిపిలు ఎన్నికలు, పొత్తుల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు విషపూరితమైన వాతావరణాన్ని బిజెపి సృష్టిస్తోందని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్న ఈ పాలకుల విధానాలకు ప్రత్యామ్నాయంగా ‘జనం కోసం సిపిఎం’ అన్న ప్రజల అజెండాను ముందుకు తీసుకురావడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశమని అన్నారు.

Also Read : కారణంగా విలేకరిపై దాడి

జూన్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం జులైలో కూడా కొనసాగుతుందని తెలిపారు. నిత్యావసర ధరల పెరుగుదల, ఇళ్లు, నీరు వంటి సమస్యలు తెలుసుకోవడమేనని ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. వైసిపి ఈ మూడేళ్ల పాలనలో సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా భారాలతో ప్రజలు అల్లాడుతున్నారని, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకు కూడా కోత పడుతుందని అన్నారు. ఇక బిజెపి రాష్ట్రంలో కుల,మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేపడుతోందని అన్నారు. భారత దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మంటగలిపిన పార్టీనే బిజెపి అని మండిపడ్డారు. ఈనేపథ్యంలో సిపియం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు సమస్యలు పరిష్కారం కోసం ప్రచార ఆందోళనలకు సిపియం కృషి సిపియం శ్రేణులు భాగస్వామ్యం కావాలని, ప్రజలు సహకారం అందివ్వాలని కోరారు.

Also Read : ప్రతి శుక్రవారం ఫ్రైడే-ఫ్రైడే నిర్వహించాలని

ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు, నాయకులు సి.రవికుమార్, సుబ్బరామయ్య, పెంచులయ్య, జయరామయ్య, జాన్ ప్రసాద్, కేశవులు, హరినారాయణ, జయచంద్ర, సుధాకర్, జనార్ధన్, దేసయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube