జనవరి 1 అన్ని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవు

జనవరి 1 అన్ని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవు

0
TMedia (Telugu News) :

జనవరి 1 అన్ని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవు

– తెలంగాణ సర్కార్‌

టీ మీడియా, డిసెంబర్ 27, హైదరాబాద్‌ : న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. డిసెంబర్‌ 31 రాత్రి 1 గంట వరకు ఈ సెలబ్రేషన్స్‌ జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 31 రాత్రి ఒంటి గంట వరకు పబ్‌లు, క్లబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హౌటళ్లు తెరచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛిత సంఘటనలకు పాల్పడకూడదంటూ సూచనలు జారీ చేశారు.

Also Read : అమెరికాలో రోడ్డు ప్ర‌మాదం..

జనవరి 1వ తేదీన పాఠశాలలకు సెలవు..
జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ సర్కార్‌ పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండవ శనివారం సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నూతన సంవత్సర వేడుకల కోసం పార్టీలు నిర్వహించేవారు, పబ్‌లు, క్లబ్‌లు, ఇతర పార్టీల నిర్వాహకులకు హైదరాబాద్‌ పోలీసులు పలు సూచనలు ఇచ్చారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్‌ వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్‌, గంజాయి తీసుకున్నట్లు తెలిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్‌ ఇచ్చారు.

Also Read : జూనియర్ డాక్టర్ల ధర్నా

బ్యాంకులకూ సెలవు..
తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద బ్యాంకులకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1వ తేదీన సెలవు కాకుండా, జనవరిలో మరో మూడు సెలవులను కూడా రాష్ట్ర సర్కార్‌ ప్రకటించింది. వీటన్నింటినీ సాధారణ సెలవుల్లో జాబితా చేశారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube