జవాబిదారి తనమా నీ జాడ ఎక్కడా?

అక్రమార్కులపై చర్యలు శూన్యం

0
TMedia (Telugu News) :

         జవాబిదారి తనమా నీ జాడ ఎక్కడా?

అక్రమార్కులపై చర్యలు శూన్యం

దమ్మపేట లో మట్టి ట్రాక్టర్ ఢీకొనడంతో యువకుడు మృతి

ఈ మృతికి కారకులు ఎవరు పాలకులా? పాలనాధికారులా? ప్రజలా?

టీ మీడియా, ఏప్రిల్ 24, అశ్వరావుపేట : నియోజవర్గంలో పరిపాలన ఎలా ఉంది అంటే అక్రమార్కులకు మూడు పూలు ఆరు కాయలు చందాన నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణమేమిటంటే ఏవ్వరైన అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ సమస్య గురించి ప్రజలు అధికారులకు ఫోన్లు చేసిన స్పందించరు. అక్రమాలు జరుగుతున్న ప్రదేశం నుండి విలేకరులు అధికారులకు ఫోన్లు చేసి సమాచారం అందించిన ఆ ప్రదేశానికి అధికారులు ఎవరూ రారు అక్రమాలపై ఎన్ని వార్తలు రాసిన వాటిపై అధికారులు చర్యలు తీసుకోరు కారణం ఏమిటంటే ఇప్పటికీ పాఠకులకు అర్థమవుతుంది. అక్రమార్కుల నుండి భారీ స్థాయిలో ముడుపుల మత్తులో అధికారులు ఉండటమే దీనికి ప్రధాన కారణం. నియోజకవర్గంలో ఏ శాఖ అధికారి నుండి కూడా జవాబిదారితనం లేదని ఇట్టే అర్థమవుతుంది. ఒక్క శాఖ అని కాదు అన్ని శాఖలు ఈ విధంగానే ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నియోజవర్గంలో దమ్మపేట మండలంలో ఆదివారం అక్రమ మట్టి తోలకాలు వల్ల బైక్ కి మట్టి ట్రాక్టర్ వేగంగా ఢీకొనడంతో గండుగులపల్లి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందిన సంఘటనలో నిజ నిజాలు తెలుసుకుంటే మండలానికి చెందిన ఓ ప్రబుద్ధుడు అక్రమంగా అధికారులు సెలవులో ఉన్న సమయాన్ని ఆసరాగా తీసుకుని యదేచ్ఛగా అక్రమ మట్టి తోలకాలు మూడు రోజుల నుండి నిర్వహిస్తున్నాడు.

 

 

అనుమతి లేకుండా దొంగతనం గా తోలుతున్నం అనే భయం తో ట్రాక్టర్ డ్రైవర్లు అతివేగంగా హద్దు అదుపు లేకుండా ఒకరిని మించి ఒకరు పోటి పడుతూ తోలుతున్నారని,కొందరు మద్యం కూడా సేవించి తోలుతున్ననారని ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు. ఇంత విచ్చలవిడిగా మట్టి అక్ర రవాణా జరుగుతున్న సంబంధించిన శాఖల వారందరికీ తెలుసు కానీ వారు సెలవులో ఉండటం వారికో కారణం కాగా ఈ కాంట్రాక్టర్ కి ఇదివరంగా మారింది. చర్యలు తీసుకోవాలి అంటే ఉన్నతాధికారులే కాదు దిగువ స్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోవచ్చు కానీ అటువంటి చర్యలు ఏమీ ఉండవు. ఈ క్రమంలో అధిక వేగంతో ట్రాక్టర్లు నడుపటంతో ప్రమాదవశాత్తు అమాయకమైన యువకుడు బలయ్యాడు ఆ కుటుంబం రోడ్డు పాలయింది ఈ సంఘటనకు కారకులు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులను నిందించాలా? ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్నా ప్రభుత్వ అధికారుల నిందించాలా? వీరిద్దరూ వారి యొక్క విధులను సక్రమంగా నడిపిస్తే ఈ ప్రమాదం జరిగేదైనా ఈ కుటుంబానికి ఇంతటి అన్యాయం జరిగేదేనా ఒక్కసారి ఆలోచించండి. అధికారులకు, పాలకులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు మధ్యవర్తిగా ఉంటూ మీడియా ఎన్నో ఇటువంటి సమాచారవార్తలను ప్రచురించిన ఉన్నత స్థాయి అధికారులనుండి జవాబుదారితనం లేకపోవడంతో ఈ అక్రమార్కులు ఎంతటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కొంచెం మానవతా దృక్పథంతో మీ విధులను సక్రమంగా నిర్వహిస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గంలో జరిగే అక్రమ మట్టి తోలకాలు, అక్రమ ఇసుక రవాణా, గిరిజన చట్టాలను తుంగలో తొక్కే వైనం,1/70 యాక్ట్ నీ విస్మరించి నర్సరీల పేరుతో కోట్లలో వ్యాపారం, చెరువుల ఆక్రమణ,చెరువు కాలవలను మింగేసి రియల్ ఎస్టేట్ వెంచర్,చెరువు శికం భూమిలో సుమారు 40 తాటి చెట్లు తొలిగించి భూమిని అక్రమిస్తున్న బడా రైతు ఇలా ఎన్నో విషయాలపై అధికారులు దృష్టి సారించాలనీ వారి దృష్టి కి వచ్చిన ప్రతి అంశం పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను నియోజవర్గ ప్రజలు కోరుతున్నారు.మీ గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ప్రజలు కూడా ఉపేక్షించకూడదని ప్రజల్లో కూడా చైతన్యం రావాలని గిరిజన సంఘాల నాయకులు తెలుపుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube