తెలంగాణ సిద్ధాంత రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్

మేకల మల్లిబాబు యాదవ్

2
TMedia (Telugu News) :

తెలంగాణ సిద్ధాంత రూపశిల్పి ప్రొఫెసర్ జయశంకర్

– మేకల మల్లిబాబు యాదవ్
టీ మీడియా,ఆగస్టు6, ఖమ్మం సిటీ:ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయి తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సాధనకుఅంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కొనియాడారు.ఈరోజు పండితాపురంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

 

Also Read : టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మల్లిబాబు యాదవ్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆగస్టు 6 1934 వరంగల్ జిల్లా అక్కంపేటలో జన్మించారని, ఆర్థిక శాస్త్రంలో పి హెచ్ డి పట్టాపొంది,ప్రిన్సిపాల్ గా రిజిస్టర్ గా,కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా అనేక ఉన్నత పదవులు అనుభవించారు. సొంత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోకుండా కేవలం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని, 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో మరియు 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, దేశ విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రసంగించి అనేక పుస్తకాలు రాసి తెలంగాణ సిద్ధాంతాన్ని రూపొందించిన మహా వ్యక్తి జయశంకర్ సార్ అని తెలిపారు . 2001 నుంచి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక సలహాదారుడుగా ఒక సిద్ధాంతకర్తగా గురువుగా పనిచేసిన మహానుభావుడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాదు, లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు నాయక్, జక్కుల రామ్మూర్తి యాదవ్, మేకల మహేష్ బాబు యాదవ్,సాయి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube