పోలీసు కార్యాలయములో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి

పోలీసు కార్యాలయములో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి

1
TMedia (Telugu News) :

పోలీసు కార్యాలయములో ఘనంగా ఆచార్య జయశంకర్ సార్ జయంతి
టీ మీడియా,ఆగస్టు6, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ సిద్ధాంతకర్తగా,ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి వేడుకలను జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయములో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ముందుగా ఆచార్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించినారు.

 

Also Read : గోరంట్లపై విచారణకు డీజీపీకి మహిళా కమిషన్‌ లేఖ

 

అనంతరం ఎస్పీ గారు మాట్లాడుతూ ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని,ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని అన్నారు.తెలంగాణ సిద్ధాంతకర్తగా,ఉద్యమకారుడిగా ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఎస్పీ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్లు సత్యవతి,శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube