టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి

1
TMedia (Telugu News) :

టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి
టీ మీడియా, ఆగస్టు 6, ఖమ్మం: టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ గ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ ల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ లోని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యాలయంలో స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకను నిర్వహించారు. తొలుత అప్జల్ హసన్ గారు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఉద్యోగులతో కలిసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా టి ఎన్ జి వో జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ గారు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంత కర్తగా ఖ్యాతి గాంచిన జయశంకర్ సార్ స్వరాష్ట్ర ఆకాంక్షలను,ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించడాని కెసిఆర్ కు మార్గదర్శకత్వం వహించిన ఘనత జయశంకర్ సార్ దే అని అన్నారు.తెలంగాణ ఉద్యమానికి ముందే ముల్కి ఉద్యమం (ఇడ్లీ .సాంబార్ గో బ్యాక్ )లో కూడా జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది అని జయశంకర్ సార్ ఆశయ సాధన ను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు.

 

Also Read : షాప్ యజమానులకు సన్మానం

 

ఆరు దశాబ్దాలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తని తెలిపారు.ప్రత్యేక రాష్ట్ర సాధన తన కళ్ళతో చూడాలని కాంక్షించిన వ్యక్తి దురదృష్టశావత్తు ప్రత్యేక రాష్ట్ర అవతరణకు ముందే కన్ను మూయటం బాధాకరం అని పేర్కొన్నారు ..ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ నందగిరి శ్రీను,మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాబాస్ జ్యోతి,వెంకట్ రెడ్డి,రామకృష్ణ,పురుషోత్తం రెడ్డి,హాబీబ్,రామారావు,సత్యనారాయణ, ప్రకాష్,ఎల్.గోపాల్ రావు,అశ్విని రెడ్డి,స్వప్న,చంద్రశేఖర్, బంగారయ్య,రహీం,స్పోర్ట్స్ టౌన్ సెక్రెటరీ ప్రసాద్,బుద్ధ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube