జయశంకర్ సార్ ఆశయాలను ఆచరణలో పెడుతున్న సీఎం కేసీఆర్
-ఎంపీ నామ నాగేశ్వరరావు
టీ మీడియా, జూన్22,ఖమ్మం: తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజలు కలకాలం గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధనే ఆశగా, శ్వాసగా జీవించారన్నారు. జీవితం మొత్తం ప్రజా శ్రేయస్సు, తెలంగాణ ఉద్యమానికే ధారపోసిన ఆయన ఆశయం స్ఫూర్తిదాయకమన్నారు. జయశంకర్ సార్ కలలు కన్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారని స్పష్టం చేశారు. సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందన్నారు.
Also Read : వాటర్ ప్లాంట్ కేసులో స్టేషన్ బెయిల్
యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పధకాలు అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి ఆయన ఆత్మకు శాంతి చేకూరుస్తుందన్నారు. ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. జీవితాంతం తెలంగాణ కోసమే తపించి, తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రో జయశంకర్ సార్ అంటే సీఎం కేసీఆర్కు అమితమైన గౌరవమని చెప్పారు.
Also Read : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ ను ప్రారంభించాలి
అందుకు నిదర్శనంగానే రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక జిల్లాకు, అలానే ఒక విశ్వవిద్యాలయానికి కూడా జయశంకర్ సార్ పెట్టారన్నారని నామ పేర్కొన్నారు. ప్రో జయశంకర్ సార్ తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచి ఉంటారని వ్యాఖ్యానించారు. నేటి యువత జయశంకర్ సార్ స్ఫూర్తితో ముందుకు సాగాలని టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావుఆకాంక్షించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube