మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్
మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్
మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్‌పింగ్
టీ మీడియా,మార్చి 10,బీజింగ్ : చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ మూడవసారి బాధ్యతలు స్వీకరించారు. మరో ఐదేళ్లు ఆయనను అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (చైనా పార్లమెంట్) ఆమోదించింది. గత అక్టోబర్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) కాంగ్రెస్ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. సిపిసి పార్టీ బాధ్యతలు అప్పగించడంతో మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.బీజింగ్‌లోని తియాన్‌మెన్ స్క్వేర్‌లో ఓటింగ్ నిర్వహించగా… జిన్‌పింగ్‌కి అనుకూలంగా 2,952ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల అనంతరం ఆయన రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు. సుసంపన్నమైన, బలమైన, ప్రజాస్వామ్య, నాగరిక, సామరస్యపూర్వకమైన, ఆధునిక సోషలిస్ట్ దేశాన్ని నిర్మిస్తానని జిన్‌పింగ్ ప్రతిజ్ఞ చేశారు. జిన్‌పింగ్ సన్నిహితుడు హన్ ఝెంగ్‌ను దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.