నోటు పుస్తకాలు పంపిణీ చేసిన జె.ఎన్.టి.యు బృందం

నోటు పుస్తకాలు పంపిణీ చేసిన జె.ఎన్.టి.యు బృందం

1
TMedia (Telugu News) :

నోటు పుస్తకాలు పంపిణీ చేసిన జె.ఎన్.టి.యు బృందం
టీ మీడియా; జూన్ 22; జగిత్యాల జిల్లా;
జె.ఎన్.టి.యు నాచుపల్లి కాలేజీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ రామ్ సాగర్ పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు బుధవారం నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాల బాలికలకు రాత పుస్తకాలు ప్రతి ఒక్కరికి ఐదు చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు పిల్లలందరూ బాగా చదివి పాఠశాలకు పేరు తీసుకు రావాలన్నారు.

Also Read : భారీ భూకంపం

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి డి మోహన్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి వేణుగోపాల్, రసాయనశాస్త్ర హెచ్ ఓ డి బి సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తైదల అంజయ్య, ప్రవీణ్ కుమార్ ఎస్ఎంసి చైర్మన్ ఎల్ సుజాత, ఏ మహేష్ ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు జేఎన్టీయూ కాలేజీ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube