ఎస్.బి. ఐ.టి.లో ప్రాంగణ నియామకాలు

ఎస్.బి. ఐ.టి.లో ప్రాంగణ నియామకాలు

1
TMedia (Telugu News) :

ఎస్.బి. ఐ.టి.లో ప్రాంగణ నియామకాలు

టీ మీడియా, జూన్21,ఖ‌మ్మం: ప్రముఖ వర్చుస కంపెనీ మంగళ వారం నగరం లోని ఎస్.బి. ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల లో సాఫ్టు వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కు మంగళ వారం నిర్వహించిన ఇంటర్యూ లో 90 మంది విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.ఈ ఉద్యోగాల కోసం మొత్తం 600మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 300మoది రాత పరీక్ష కు హాజరయ్యారని, వ్రాత పరీక్షలో అర్హత సాధించిన 90 మందికి కళాశాల ప్రాంగణం లో ఇంటర్వ్యూ లను నిర్వహించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు..లక్ష్యం తో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమేవిద్యార్ధులు ప్రణాళికా బద్ధం గా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగితే ఏదైనా సాధ్యమే అని ఎస్.బి. ఐ.టి.కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.

Also Read : ప్ర‌తి ఒక్క‌రి దినచర్యలో యోగ ఒక భాగమ‌వాలి

వర్చుస కంపెనీ మంగళవారం సాఫ్టువేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్దులు కళాశాల కు విధిగా క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రణాళికా బద్ధం గా అధ్యాపకులు బోధించిన అంశాన్ని అభ్యసిస్తే ఇటువంటి నియామకాల్లో విజయం సాధించవచ్చని అన్నారు. విద్యార్దులు ఇంటర్వ్యూ లకు భయపడాల్సిన పని లేదని ఆన్నారు. క్రమశిక్షణ తో తరగతులకు క్రమం తప్పకుండా హాజరై తే విజయం తధ్యం అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా.జి.ధాత్రీ, ప్రిన్సిపాల్ డా.జి.రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్లు శివ ప్రసాద్, సుభాస్ చందర్,జి.ప్రవీణ్, వర్చుసా కంపెనీ ప్రధాన హెచ్.ఆర్. అభిషేక్, పలువురు కంపెనీ ప్రతినిథులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube