ఉద్యోగ బంధువు కెసిఆర్ – జెడ్పీ చైర్మన్ వసంత సురేష్

టీ మీడియా,మార్చి9,ధర్మపురి

1
TMedia (Telugu News) :

ఉద్యోగ బంధువు కెసిఆర్ – జెడ్పీ చైర్మన్ వసంత సురేష్
టీ మీడియా,మార్చి9,ధర్మపురి:
రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తూ గముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా 91,142 ఉద్యోగ నియామకాలు దాంట్లో జగిత్యాల జిల్లాకు 1,063 కొత్త ఉద్యోగాలు భర్తీ చేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సభ్యులతో ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి, సంబరాలు జరుపుకున్న జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్
ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ:నిరుద్యోగ యువకులకు అసెంబ్లీ వేదికగా భారీ ఎత్తున 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్ర పటానికి జిల్లా పరిషత్ కార్యాలయంలో పాలాభిషేకం చేయడం జరిగింది.

Also Read : టీఆర్ఎస్ తోనే నిరుద్యోగులకు బంగారు భవిష్యత్

తెలంగాణ చిత్రపటాన్ని దేశంలో గర్వంగా చాటిన వ్యక్తి సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 91 వేల 142 ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేయడం పట్ల హర్షంఈ రోజు ఉద్యోగాలు భర్తీ చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది.బీజెపి అధికారంలోకి రాగానే ఏటా 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తమన్న మోదీ 7సంవత్సరాల కాలంలో కనీసం కోటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయ్యలేక పోయాడు.
తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ముందుకు సాగింది. కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు ఈ విషయంలో ప్రగతి సాధించామం.నియామకాల విషయంలో పెద్ద ఎత్తున 91 వేయి 142 పోస్టుల భర్తీకి మరియు 95% స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విద్యార్థులు యువకులు తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube