తక్షణమే నోటిఫికేషన్స్ ఇవ్వలి: డివైఎఫ్ఐ

టీ మీడియా, మార్చి09, మధిర

0
TMedia (Telugu News) :

తక్షణమే నోటిఫికేషన్స్

ఇవ్వలి:డివైఎఫ్ఐ

 

టీ మీడియా, మార్చి09, మధిర:

పట్టణంలోని స్థానిక సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం బుధవారంనిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Also Read : ముఖ్యమంత్రికి పాలాభిషేకం

రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో బుధవారం ప్రకటించిన 80039 పోస్టులను మళ్లీ ఎన్నికల దాకా వాయిదా వేయకుండా వెంటనే భర్తీ చేయాలని,భర్తీతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాదని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మద్దల ప్రభాకర్ షేక్ బషీరుద్దీన్ లు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిఆర్ బిశ్వాల్ కమిటి నేతృత్వంలో పిఆర్సి నివేదిక ప్రకారం 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్టు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు శాసనసభలో 80039 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రకటించడం సరియైందికాదన్నారు.

Also Read : కేసీఆర్ ప్రకటన నిరుద్యోగులు నమ్మేపరిస్థితి లేదుji

రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో, వివిధ ఎన్నికల‌ సందర్భంగా అనేక ప్రకటనలు చేశారని ఈసారి ప్రకటనలకు పరిమితంకాకుండా తక్షణమే నియమకాల ప్రక్రియకై ఒకేసారి నోటిఫికేషన్స్ వేసి పోస్టులను భర్తీ చేయాలన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చే ముందు ఇస్తానన్న నిరుద్యోగ భృతి 2018 నుండి ఇప్పటివరకు నిరుద్యోగులకు రావాల్సిన భృతి ఇవ్వాలని, అదేవిధంగా ఏడేండ్ల కాలంలో‌ భర్తీ లేక,భృతి లేక యాభై మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు ప్రభుత్వమే భాద్యత వహించి నిరుద్యోగ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టిఎస్పిఎస్సి లో నిరుద్యోగ యువత వన్ టైం రిజిస్ట్రేషన్ లో 28 లక్షలకు పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నిరుద్యోగులందరీకీ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడానికై అన్ని జిల్లాలో ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలన్నారు. ఈరోజు శాసనసభలో ప్రకటించినవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్‌ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కాలాయాపన చేయకుండా,ప్రకటనకే పరిమితంకాకుండా ఖాళీగా ఉన్న 1,91,126 పోస్టులన్నింటికి తక్షణమే నోటిఫికేషన్స్ వేసి భర్తీ చేయాలన్నారు.

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పరిశ్రమ ఏర్పాటు చేస్తామన్న హామీ తుంగలో తొక్కారని వారన్నారు ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రాంతంలో భద్రాచలం కొత్తగూడెం మణుగూరు పారిశ్రామికీకరణ చేస్తామని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహిస్తామని ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ పోయిందని వారు ప్రశ్నించారు.

ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం చేయడం ఏర్పాట్లపై స్పందన లేదు అని అన్నారు. ఇంకా అనేక వాగ్దానం ఎన్నికల ముందు చేసి తరువాత వదిలేస్తున్నారని ఈ ఘటన కూడా అట్లనే ఉంటుందని వారు అన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు చింతల రమేష్, కణతల వెంకటేశ్వర్లు, దాసరి మహేందర్, మధు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube