స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

1
TMedia (Telugu News) :

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

టీ మీడియా, నవంబర్ 2, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్‌ ప్రారంభించింది. ఆసక్తి కలిగినవారు ఆన్‌లైన్‌లో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 710 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఐటీ ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, రాజ్‌భాష అధికారి, లా ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Also Read : బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ ఖాళీలు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube