ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి
నిరుద్యోగ భృతి ప్రకటించాలి
టీ మీడియా,మార్చి 7, పెద్దపల్లి :
భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సూచన మేరకు బీజేవైఎం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్,అధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద,గాయత్రి డిగ్రీ కళాశాలలో శ్రీకాంత చారి చిత్రపటానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళ్ళు అర్పించిన అనంతరం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,నిరుద్యోగ భృతి ప్రకటించాలని,కోటి సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైమ్ జిల్లా అధ్యక్షుడు బద్రి దేవేందర్,ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్,ఉపాధ్యక్షుడు జ్యోతిబస్,మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో.
రంజిత్,సాగర్,నరేష్,రామకృష్ణ,రాకేష్, సతీష్,గణేష్,శ్రీ హర్ష,సంతోష్,రఘుదీప్, నిరు ద్యోగులు,విద్యార్థి,యువజన నాయకులు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.