మాజీ కానిస్టేబుల్ మోసాలు -ఊద్యోగాల పేరుతో వసూళ్ళ

పట్టుకోన్నటాస్క్ ఫోర్స్ పోలీసులు

1
TMedia (Telugu News) :

మాజీ కానిస్టేబుల్ మోసాలు -ఊద్యోగాల పేరుతో వసూళ్ళ

-పట్టుకోన్నటాస్క్ ఫోర్స్ పోలీసులు
టీ మీడియా , ఏప్రిల్ 11,వరంగల్ :నిరుద్యోగులకు ఊద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో డబ్బులకు వసూళ్ళు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న మాజీ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసారు.* నిందితుడి నుండి ఒక ఖరీదైనకారుతో పాటు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ భూపాలపల్లి జిల్లా, మలహర్ మండలం, అన్ సాన్ పల్లికి చెందిన బానోత్ రాజ్ కుమార్ (35) నిందితుడు గతంలో సెంట్రల్ ఇండ్రస్టీ సెక్యూరీటీ ఫోర్స్ కానిస్టేబుల్ గా కొద్ది కాలం పనిచేసిన అనంతరం నిందితుడు విధులకు గైహజర్ కావడంతో నిందితుడుని అధికారులు విధులు తొలగించారు. నిందితుడు స్థానిక భూపాల్ పల్లి పట్టణంలో వుంటూ సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. ఇందుకోసం తనకు ఆర్.టి.ఏ, విద్యుత్తు, పోలీస్,కలెక్టరేట్, ఎటిపిసి,ఆర్ టిసితో పాటు కేయూసి విశ్వవిధ్యాలయముల్లో తనకు ఉన్నతస్థాయి అధికారులతో పరిచయాలు వున్నాయని. ఆయా విభాగాల్లో జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిందితుడు ప్రచారం కల్పించుకోడంతో పాటు, నమ్మిన బాధితుల నుండి నిందితుడు సుమారు మూడు నుండి ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూళు , చేయడంతో చేసాడు, మరికొద్ది మందికి ఏకంగా నిందితుడు పలు విభాగాల్లో జూనియర్ క్లర్క్ గా నకిలీ నియామక పత్రాలను సైతం అందజేసి వారిని బురిడి కొట్టించాడు.

Also Read : టీఆర్ఎస్ దీక్ష‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన ఎమ్మెల్యే సండ్ర‌

నకిలీ నియామక పత్రాలకు అందుకోని సదరు ప్రభుత్వ కార్యాలయకు వెళ్ళిన బాధితులకు ఇవి నకిలీ నియామక పత్రాలని తెలియడంతో ఖంగుతిన్న బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ అదేశాల మేరకు రంగంలో దిగి టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ చేపట్టి నిందితుడుని అరెస్టు చేసారు. నిందితుడు ద్వారా సూమారు 20మంది బాధితులు మోసపోవడంతో పాటు సూమారు 57 లక్షల రూపాయలను వసూళ్ళకు పాల్పడ్డాడు. నిందితుడిపై హన్మకొండ, ఇంతేజార్ గంజ్, సుబేదారితో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూర్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయినట్లుగా పోలీసుల విచారణ నిందితుడు అంగీకరించాడు. తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడుని కాజీపేట పోలీసులకు అప్పగించడం జరిగింది.నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాజ్, సంతోష్, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి,టాస్క్ ఫోర్స్ ఎస్.ఐ ప్రేమానందమ్,ఏఏఓ సల్మాన్ పాషా,టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, శ్రీకాంత్, సృజన్,లియాకత్ ఆలీ, మహేందర్, శ్రవణ్ కుమార్, శ్రీనుతో పాటు సైబర్ క్రైం కానిస్టేబుల్ కిషోర్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube