ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 ఉద్యోగాలు

-టెన్త్ అర్హతతో కూడా

1
TMedia (Telugu News) :

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 ఉద్యోగాలు

-టెన్త్ అర్హతతో కూడా

టీ మీడియా, అక్టోబర్ 31, న్యూఢిల్లీ : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనుంది.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ రీజియన్‌లో 47 ఖాళీలు ఉండగా, విజయవాడ రీజియన్‌లో 7 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత, స్థానిక భాష తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్‌ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపడతారు.

Also Read : మోదీ ఎందుకీ కిరాతకం

పోస్టుల వివరాలు…

* ఖాళీల సంఖ్య: 1671 పోస్టులు

1) సెక్యూరిటీ అసిస్టెంట్/ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు (హైదరాబాద్-45, విజయవాడ-05)
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యా్ర్హత ఉండాలి. స్థానిక భాష తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులకు 40 ఏళ్లవరకు సడలింపు వర్తిస్తుంది.

2) మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్‌): 150 పోస్టులు (హైదరాబాద్-02, విజయవాడ-02)
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన విద్యా్ర్హత ఉండాలి. స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25.11.22 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులకు 40 ఏళ్లవరకు సడలింపు వర్తిస్తుంది.

Also Read : గుజరాత్‌:లో ఘోర ప్రమాదం

దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు, పరీక్ష ఫీజు:రూ.500 చెల్లించాలి. ఇందులో రూ.50 పరీక్ష ఫీజు కాగా, రూ.450 రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీల కింద వసూలుచేస్తారు. అభ్యర్థులందరూ కచ్చితంగా రిక్రూట్‌మెంట్ ప్రాసెసింగ్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వర్గాలకు చెందిన పురుష అభ్యర్థులు అదనంగా పరీక్ష ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం:
జీత భత్యాలు:సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21,700 – రూ.69,100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022. చివరితేదీ: 25.11.2022

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube