జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ లైసెన్సు ర‌ద్దు

జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ లైసెన్సు ర‌ద్దు

1
TMedia (Telugu News) :

జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ లైసెన్సు ర‌ద్దు

టీ మీడియా, సెప్టెంబర్ 17, ముంబై: జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్ ఉత్ప‌త్తి లైసెన్సును మ‌హారాష్ట్ర ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసింది. ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ వ‌ల్ల శిశువుల చ‌ర్మాల‌పై ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ఏజెన్సీ తెలిపింది. ల్యాబ‌రేట‌రీ ప‌రీక్ష స‌మ‌యంలో పౌడ‌ర్ పీహెచ్ విలువ స్టాండ‌ర్డ్‌గా లేద‌ని ఎఫ్‌డీఏ చెప్పింది.

Also Read : సిరియాపై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌

కోల్‌క‌తాకు చెందిన సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణ‌యం తీసుకున్న‌ది. పూణె, నాసిక్‌ల నుంచి పౌడ‌ర్ శ్యాంపిళ్ల‌ను సేక‌రించి మ‌హారాష్ట్ర‌లో ప‌రీక్ష‌లు చేశారు. రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే సంస్థకు షోకాజ్‌ నోటీసు జారీ చేయగా.. సంస్థ ఆ నోటీసులను కోర్టులో సవాలు చేసింది. కాగా, తాము టాల్క్‌ ఆధారిత బేబీ పౌడర్‌ను వచ్చే ఏడాది నుంచి నిలిపేస్తున్నట్లు గత నెలలో జాన్సన్‌ సంస్థ ప్రకటించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube