సిపిఐ లో చేరిక లు

సిపిఐ లో చేరిక లు

1
TMedia (Telugu News) :

సిపిఐ లో చేరిక లు

టీ మీడియా,జూన్ 27, గోదావరిఖని :

రామగుండం కార్పోరేషన్ పరిధిలోని 29వ డివిజన్ బాపూజీ నగర్ కు చెందిన దాదాపు ముప్పై మంది ఎండీ నిజాం ఆధ్వర్యం లో సోమవారం సీపీఐ లో చేరారు.ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్,జిల్లా సహాయ కార్యదర్శి గోశిక మోహన్, నగర సహాయ కార్యదర్శి తాళ్లపల్లి మల్లయ్య,లు సిపిఐ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్ మాట్లాడుతూ… భారతదేశంలో మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని, సమస్యలు ఎక్కడ ఉంటే సిపిఐ జెండా అక్కడ ఉంటదని ప్రజా సమస్యలను పరిష్కరించడమే సిపిఐ ధ్యేయం అని ఆయన అన్నారు.

Also Read : డీజీపీ మహేందర్‌ రెడ్డి పేరుతో సైబర్‌ నేరగాళ్ల వసూళ్లు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రతి సమస్య మీద స్పందిస్తున్న,ప్రజల సమస్య మన సమస్య అనుకునే విధంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) కి ఆకర్షితులై వారు పార్టీలో చేరడం జరిగిందని ఆయన అన్నారు. అనంతరం 29వ డివిజన్ కన్వీనర్ గా ఎండి. నిజాం ను,కో కన్వీనర్ గా గొర్రె సునీల్ ని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు శనిగరపు చంద్రశేఖర్ రేణుకుంట్ల ప్రీతం, రేవంత్,రాజు,శీను తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube