ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

1
TMedia (Telugu News) :

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి

టీ మీడియా, జూన్ 7, వనపర్తి బ్యూరో : పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు శంకర్‌గౌడ్‌ కోరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా 07-06-2022 రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో . ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయుల చేత బోధన నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే నాణ్యమైన బోధన అందించనున్నట్లు, స్కూల్ యూనిఫామ్స్, పుస్తకాలు ఉచితంగా ఇస్తున్నామన్న పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నామని చెప్పారు.  రంగు రంగుల బొమ్మలతో పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.ఆర్మీ ఆర్మీ రిటైర్డ్ అధికారి రాజాగౌడ్, ఉపాధ్యాయులు నాగేశ్వరమ్మ,విష్ణు,యువకులు పాల్గొనారు.

Also Read : రోడ్డు విస్తరణ పనుల్లో ఆలస్యం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube