కాంగ్రెస్ లో చేరికలు
టి మీడియా, నవంబర్ 21,ఖమ్మం రూరల్ : మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన 3వ వార్డు బి.ఆర్.ఎస్ వార్డు సభ్యుడు బత్తుల మధు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో పొంగులేటి ప్రసాదరెడ్డి వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ ప్రభుత్వ నిరంకుష పాలనతో ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా విసిగిపోయారన్నారు. ముఖ్యంగా తమపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక.. అటు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ప్రజా ప్రతినిధులు చాల ఇబ్బంది పడ్డారని, రాబొయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సుపరిపాల అందుతుందనే నమ్మకంతో అధికార పార్టీని వదిలించుకొని హస్తం పార్టీలో చేరుతున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరు హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ అభ్యర్దులని గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శివరాత్రి వీరస్వామి, దండగల ఉపేందర్, యల్లారావు, ఉపేందర్, వెంకటేశ్వర్లుతో పాటు 50 కుటుంబాల వారున్నారు.
Also Read : విరామం లేకుండా కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌ను.. రికాం లేకుండా గెలిపించాలి
గుదిమల్ల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 60 కుటుంబాలు..
గుదిమల్ల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రసాద రెడ్డి సమక్షంలో 60 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. గుదిమల్ల ఆటో యూనియన్ నాయకులు పారా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ప్రసాద రెడ్డి కండువ కప్పి సాధరంగా కాంగ్రెస్ లొకి ఆహ్వానిచారు. ఈ సంధర్బంగా ప్రసాద రెడ్డి మాట్లాడుతూ రాబొయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందన్నరు. ప్రజల నుండి వస్తున్న ఆధరనను చూసి ఒర్వలేక బి.ఆర్.ఎస్ నేతలు మల్లగుల్లలు పదుతున్నారని.. ఒటమి భయం బి.ఆర్.ఎస్ నేతల్లో కొట్టొచినట్లు కనబడుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతమని.. శీనన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 6 గ్యారంటీలను ప్రతి ఒక్కరికి అమలు చేసి తీరుతుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో సాల్వె చంద్రం, చల్ల యల్లయ్య(ఉపెందర్), చెరుకుపల్లి వెంకటేశ్, బండారి శ్రీను తదితరులున్నారు.