చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

0
TMedia (Telugu News) :

చిన్నారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

టీ మీడియా, నవంబర్ 6, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సమక్షంలో గోపాల్ పేట్ టౌన్ నుండి బిఆర్ఎస్ పార్టీ 46 మంది మహిళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొంకి వెంకటేష్ గోపాల్ పేట్ మండలం ప్రధాన కార్యదర్శి జిల్లెల ప్రవీణ్ కుమార్ రెడ్డి, సుధాకర్, లక్ష్మణ్, దేవరాజు నాయుడు, వెంకటమ్మ ఆధ్వర్యంలో గోపాల్ పేట్ టౌన్ నుంచి 46 మంది బీఅర్ఎస్ కార్యకర్తలు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి సమక్షంలో బీఅర్ఎస్ మహిళ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 1 మహాలక్ష్మి మహిళలకు ప్రతినెల 2500, 500 కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ‌, 2 రైతు భరోసా ప్రతి ఏటా 15 వేల రూపాయలు, రైతులకు కౌలు రైతులకు 12 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 500 బోనస్, 3 గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు, ఉచిత విద్యుత్ 4 ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, 5 యువ వికాసం విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ 6 చేయూత 4000 నెలవారి పింఛన్ 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఈ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే కచ్చితంగా అమలు చేస్తాము అని మాజీ మంత్రి చిన్నారెడ్డి అన్నారు.

Also Read : బీఎస్పి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలు వెంకటమ్మ, అలివేలు, బాలకృష్ణ, కెలాబ్ వెంకటమ్మ, ఎస్ శాంతమ్మ, చంద్రకళ, అంజనమ్మ, బాలేశ్వరమ్మ, సంతోషమ్మ, ఆశమ్మ, శాంతమ్మ, ఎల్లమ్మ, లక్ష్మి , నిర్మలమ్మ, బీసమ్మ, ఎల్లమ్మ, నాగమ్మ, రేణుక, రాములమ్మ, రజిత, కాశమ్మ, చిన్నమ్మ, నిరంజన్, బి శారద, శ్రీదేవి, రేణుక, ఈదమ్మ, రేణుక, జానకి సాయమ్మ, లత, కవిత, లక్ష్మి, శైలజ, కాశమ్మ, పద్మ, కవిత, సత్తెమ్మ, పెంటమ్మ, కాంతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube