పెబ్బేరు హమాలీ సంఘం బీఆర్ఎస్ లో చేరిక

పెబ్బేరు హమాలీ సంఘం బీఆర్ఎస్ లో చేరిక

0
TMedia (Telugu News) :

పెబ్బేరు హమాలీ సంఘం బీఆర్ఎస్ లో చేరిక

టీ మీడియా, నవంబర్ 27, పెబ్బేరు : పెబ్బేరు పట్టణ కేంద్రంలోని హమాలీ సంఘం నాయకులు దాదాపు 120మంది పెబ్బేరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, సింగల్ విండో చైర్మన్ గౌని కోదండరామిరెడ్డి ల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. పెబ్బేరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి పార్టీ కండవాలు కప్పి వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాకు చేస్తున్న సేవలను గుర్తించి, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు హమాలి సంఘం నాయకులు తెలిపారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని భారీ మెజారిటీతో వనపర్తి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : 10 రోజుల్లో వస్తాం.. రూ.15వేల రైతు భరోసానిస్తాం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube