ఇజ్రాయెల్‌ దాడుల్లో భార్యాపిల్లల్ని కోల్పోయిన జర్నలిస్ట్‌

సురక్షిత ప్రాంతంలో మృత్యువాత

0
TMedia (Telugu News) :

ఇజ్రాయెల్‌ దాడుల్లో భార్యాపిల్లల్ని కోల్పోయిన జర్నలిస్ట్‌

– సురక్షిత ప్రాంతంలో మృత్యువాత

టీ మీడియా, అక్టోబర్ 26, గాజా : ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైతం హమాస్‌పై ఎదురుదాడికి దిగింది. గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా తీవ్రస్థాయిలో వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ చేపడుతున్న వైమానిక దాడులతో అనేక మంది సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ప్రముఖ పాత్రికేయుడు తన కుటుంబాన్ని కోల్పోయాడు. 53 ఏళ్ల వాయెల్‌ దాహ్‌దౌ.. అంతర్జాతీయ మీడియా సంస్థ ‘అల్‌జజీరా’లో ప్రముఖ పాత్రికేయుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం గాజాలో సాయుధ ఘర్షణను కవర్‌ చేస్తున్నాడు. యుద్ధం నేపథ్యంలో గాజాలోని లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ జర్నలిస్ట్‌ కుటుంబమంతా.. గాజాలోని ఐరాస గుర్తించిన నుసీరత్‌ శరణార్థి శిబిరంలో తలదాచుకున్నారు.

Also Read : కర్ణాటక లో ఘోర రోడ్డు ప్రమాదం

దీన్ని ఇజ్రాయెల్‌ దళాలు సురక్షిత ప్రాంతం గా పిలుస్తారు. తాజాగా ఆ ప్రాంతంలో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాహ్‌దౌ భార్య, కుమారుడు, కుమార్తె మృతి చెందినట్లు అల్‌జజీరా సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా ప్రసారం చేసింది. అయితే, ఈ మరణాలను ఇజ్రాయెల్‌ ఇంకా ధృవీకరించలేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube