జర్నలిస్టులందరికి మంత్రి సమాన న్యాయం చేయాలి
– టిడిపి అధ్యక్షులు నందిమల్ల అశోక్
టీ మీడియా, అక్టోబర్ 6, వనపర్తి బ్యూరో : మీ పల్లకి మోసి,మిమ్మల్ని ఆకాశాన్నికి ఎత్తేవాళ్ళ వల్ల మునిగి పోవడం ఖాయం. ప్రజాసమస్యలపై అలు పెరుగని, అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నిజాయితీగల జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఉపాధి అవకాశాలు కలిపించడాన్నికి మేము వ్యతిరేకం కాదు.ఎన్నో ఏళ్ళుగా కుటుంబాలను విస్మరించి సమాజములో జరుగుతున్న అవినీతిని,భూ కబ్జాలను, సహజవనరుల దోపిడీని వెలికితీసి సమాజ బాగుకోసం అహర్నిశలు కృషిచేసిన సీనియర్ విలేకరులకు ఇంటి స్థలాలు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అని నందిమల్ల అశోక్ టిడిపి అధ్యక్షులు అన్నారు. జర్నలిజం చేయకున్న జర్నలిస్టులం అని చెప్పుకొని పైరవీలు చేసే వ్యక్తులకు స్థలాలు ఇవ్వడములో ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్న.ప్రముఖ దినపత్రిక నుండి తొలగించిన వ్యక్తి, వ్యాపారం పేరిట పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వ్యక్తులకు రెండేసి ప్లాట్లు,వారి భార్యలకు ఉద్యోగాలు ఇచ్చి నిజమైన జర్నలిస్టులను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Also Read : మీరు వాగ్దానాలను మర్చిపోయారా
మంత్రి స్పందించి విచారణ జరిపి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులందరికి ప్లాట్లు ఇవ్వాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్లాట్లు ఇవ్వాలని, దళిత జర్నలిస్టులకు దళితబందు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను అన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube