నో రెస్ట్ అంటోన్న ఎన్టీఆర్..కొరటాల సినిమా షురూ అయ్యేది అప్పుడే.!
టీ మీడియా ,మార్చి 30,సినిమా:జనతాగ్యారేజ్..ఎన్టీఆర్ , కొరటాల శివ,కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి ఇంప్రెషన్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఇపుడీ క్రేజీ కాంబినేషన్లో మరోప్రాజెక్టు ఎన్టీఆర్ 30 కూడా రాబోతుందని అందరికీ తెలుసు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కిన ఆచార్య మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొరటాల పూర్తి చేశాడట.మరోవైపు ఆర్ర్ఆర్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కూడా సినిమా విడుదల కావడంతో దాదాపు రిలాక్స్ అయినట్టే లెక్క. ఎన్టీఆర్, కొరటాల ఇద్దరికీ రిలీఫ్ దొరకడంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు ఎప్పుడు షురూ కాబోతుందనే దానిపై తారక్ ఓ క్లారిటీ ఇచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్లో ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ఎన్టీఆర్ వెకేషన్కు ప్లాన్ చేశాడని వార్తలు రాగా..అలాందేమీ లేదని వీలైనంత త్వరగా కొరటాలతో చేయబోయే సినిమా షూట్లో పాల్గొంటానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఓ అప్ డేట్ ఇపుడు యంగ్ టైగర్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.జూన్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టనున్నట్టు ఎన్టీఆర్ చెప్పడంతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలకు పుల్ స్టాప్ పడినట్టయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియాభట్ ఫీ మేల్లీడ్ రోల్లో నటిస్తోంది. తారక్ మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానతో కూడా సినిమా చేయనుండగా..దీనికి సంబంధించిన అఫీషియల్ అప్ డేట్ రావాల్సి ఉంది.
Also Read : జేడీయూ నేత దీపక్ మెహతాను కాల్చిచంపిన దుండగులు!
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube