మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

1
TMedia (Telugu News) :

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

 

టీ మీడియా, నవంబర్ 19, అశ్వారావుపేట : నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట లో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా అశ్వారావుపేట మండల స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆమే చిత్రపటానికి పూలమాలవేసి నాయకులు నివాళులు అర్పించారు.అనంతరం టిపిసిసి మెంబర్ వగ్గెల పూజ మాట్లాడుతూ ఇందిరాగాంధీ మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అని,ఆమె ఉక్కు మహిళగా పేరు గావించింది అని ఈమె వరసగా మూడుసార్లు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసి పేదల పక్షపాతి గా,బడుగుల బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పేరు గాంచారని అన్నారు.

 

Also Read : ఆలయమునకు విరాళం అందించిన మండల వ్యవసాయ అధికారిని

 

హరిజన,గిరిజనులకు భూమి పంపిణీ,చేసి చదువుకున్న యువతి యువకులు రాజకీయాల్లోకి రావాలి అని ఆనాడే పిలుపునిచ్చారు అని పూజ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగళ్లపు చెన్నకేశవరావు, ఎంపీటీసీ అనసూయ, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు పాండురంగా ఎస్టీసెల్ మండలాధ్యక్షులు సంగా ప్రసాద్ .సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు మహేష్, సత్యం రామకృష్ణ, సత్యవరపు బాలయ్య. ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు తగరం రాజేష్ , ముద్దు మరియమ్మ. చల్లా రమాదేవి. మందపాటి వజ్రమ్మ. మందపాటి నాగలక్ష్మి. బాణాల సునీత, పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube