-క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న సీఐ రాజ గోపాల్
టీ మీడియా,డిసెంబర్ 3, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాల మేరకు బయ్యారం సర్కిల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని తాటిగూడెం గ్రామం నందు కరకగూడెం,పినపాక రెండు మండలాల స్థాయి వాలీబాల్ టోర్నీ రెండోవ రోజు వాలీబాల్ క్రీడలు రసపట్టుగా కొనసాగుతున్నాయి.రెండోవ రోజు బయ్యారం సీఐ రాజ గోపాల్ క్రీడలను సందర్శించారు.అనంతరం వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కరకగూడెం ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్,ఏడూళ్ళ బయ్యారం ఎస్సై సూరి,ట్రైనీ ఎస్ఐ గణేష్,ఆర్ఎస్ఐలు సురేందర్,శరత్
పోలీస్ సిబ్బంది,క్రీడాకారులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.