జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన కార్యక్రమం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, అక్టోబర్ 20, మధిర:
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత మహోత్సవాల్లో భాగంగా మధిర కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన,అవగాహన కార్యక్రమం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి డి. ధీరజ్ కుమార్ మాట్లాడుతూ… బలహీన వర్గాలు ,పేదలు ,వృద్ధులు మహిళలు న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా వారికి లభించే న్యాయ సేవలని ఉపయోగించుకోవాలని, న్యాయస్థానం ముందు పేద, స్థానిక ధనిక తారతమ్యాలు లేవని న్యాయమూర్తి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భైరవభట్ల శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు,జనార్దన్ రావు, జగన్ మోహన్ రావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube