మంత్రి కేటీఆర్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

మంత్రి కేటీఆర్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

1
TMedia (Telugu News) :

మంత్రి కేటీఆర్ కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
టీ మీడియా, ఏప్రిల్ 21 వరంగల్: జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. బుధవారం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు ఆయన వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన అక్కడకు చేరుకోడానికి గంట ముందు ప్రమాదం జరిగింది.బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.

Also Read : ఘనంగా శివాలయ మహా కుంభాభిషేక మహోత్సవాలు

బుధవారం మధ్యాహ్నం రేగిన గాలిదుమారానికి ఈ ప్రమాదం జరిగింది. గాలుల ధాటికి కేటీఆర్ బహిరంగసభ టెంట్లు కూలిపోయాయి. కేటీఆర్ సభకు రాకముందే ప్రమాదం జరగడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. బహిరంగసభ మొదలయ్యాక ఈ ప్రమాదం జరిగి ఉంటే కేటీఆర్ సహా చాలా మంది నేతలు, భారీ సంఖ్యలో హాజరైన ప్రజలపై టెంట్లు కూలి గాయాలపాలయ్యేవారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube