బాధితులకు న్యాయం జరుగుతుందా

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 16 వనపర్తి : వనపర్తి పట్టణంలోని 21వవార్డు హరిజనవాడ పాతకోట మధ్యలో ఉన్న కందకంలో నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం అక్కడ నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల నివాస గృహాలను మున్సిపల్ అధికారులు పోలీసు బలగాలను ఉపయోగించి కూల్చివేయడం జరిగింది. గతంలో కూరగాయల మార్కెట్ నిర్మాణం శంకుస్థాపన కొరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వస్తున్నారని ఆగమేఘాల మీద నివాస గృహాలను కూర్చోవడం జరిగినది. ఇక్కడ నివసించే ప్రజలు తాత ముత్తాతల నుంచి రాజా రామేశ్వర్ రావు దగ్గర వారి పనులు చేస్తే రాజా రామేశ్వర రావు సహకారంతో నివాసాలు ఏర్పాటు చేసుకొని దళితులు ఇతర వర్గాలు ప్రజల అక్కడ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇవి తప్ప ఎటువంటి ప్రత్యామ్నాయం లేదు. ఈ పేద వర్గాలు మార్కెట్ నిర్మాణం చేపట్టడం వల్ల వారి ఇళ్ల స్థలాలు కోల్పోవడం జరిగింది. మున్సిపల్ అధికారులు డబల్ బెడ్రూమ్ లు ,నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ బాధితుల లిస్టు కూడా సేకరించకపోవడం బట్టి చూస్తే వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు అని అంటున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి, 10 లక్షల దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఉన్న ఇల్లు కాల్చడం వలన దళితులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది అని వారు వాపోతున్నారు. కావున అధికారులు స్పందించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి, స్థానిక మార్కెట్ షాపులు కేటాయించి జీవన ఉపాధి కల్పించాలి, ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుకుంటున్నారు. లేదంటే తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని లేకుంటే మానవ హక్కుల సంఘంలో దాఖలు పిటిషన్ వేస్తామని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రజలకు ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి ,కట్టుకోవడానికి బట్టలు కల్పించాలి ఇక్కడ ఉండే ప్రజలకు ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో వేచి చూడాలి.

Municipal Authorities have used police forces to demolish the houses of the underprivileged communities living there for the construction.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube