న్యాయం ప్ర‌తి ఒక్క‌రికీ ద‌క్కాలి : సీజేఐ చంద్ర‌చూడ్‌

న్యాయం ప్ర‌తి ఒక్క‌రికీ ద‌క్కాలి : సీజేఐ చంద్ర‌చూడ్‌

1
TMedia (Telugu News) :

న్యాయం ప్ర‌తి ఒక్క‌రికీ ద‌క్కాలి : సీజేఐ చంద్ర‌చూడ్‌

టీ మీడియా, నవంబర్ 26, న్యూఢిల్లీ : ప్ర‌జ‌ల‌కు న్యాయం అందాల‌ని, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే కోర్టులు వెళ్లాల‌ని, న్యాయం కోసం కోర్టుల చుట్టూ ప్ర‌జ‌లు తిరిగేలా చేయ‌కూడ‌ద‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి డీవై చంద్రచూడ్ అన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్స‌వం నేప‌థ్యంలో ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో సాంకేతిక విప్ల‌వం వ‌చ్చింద‌ని, సాంకేతిక మౌళిక‌స‌దుపాయాల్ని ధ్వంసం చేయ‌రాదు అని, ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీజేఐ అన్నారు. మ‌న దేశంలో భిన్న‌త్వం ఎక్కువే అని, ఇలాంటి దేశంలో స‌వాళ్లు కూడా ఎక్కువే ఉంటాయ‌ని, న్యాయం అంద‌రికీ అందేలా న్యాయ‌వ్య‌వ‌స్థ చూడాల‌ని, భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు అనేక అంశాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని సీజేఐ తెలిపారు.

Also Read : ట్రాక్టర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ఇద్దరు మైనర్లు దుర్మరణం

సుప్రీంకోర్టు ఢిల్లీలోని తిల‌క్‌మార్గ్‌లోనే ఉన్నా.. ఈ దేశానికి అదే అత్యున్న న్యాయ‌స్థానం అన్నారు. వ‌ర్చువ‌ల్ విధానం వ‌ల్ల‌.. లాయ‌ర్లు త‌మ త‌మ స్వంత ప్ర‌దేశాల నుంచే కేసుల్ని వాదించే అవ‌కాశం వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. కేసుల లిస్టింగ్ విష‌యంలో టెక్నాల‌జీని ఆశ్ర‌యించాల‌ని సీజేఐ సూచించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube