అర్హులైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

సిరిసిల్ల ఆర్డీవో

1
TMedia (Telugu News) :

అర్హులైన నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం : సిరిసిల్ల ఆర్డీవో
టీ మీడియా ప్రతినిధి, సెప్టెంబర్ 9, రాజన్న సిరిసిల్ల : జిల్లా మండలం బోయిన్ పల్లి మాను వాడ గ్రామంలో జిల్లా ఆర్డీవో శ్రీనివాస్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేస్తామని 100% పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని శ్రీనివాస్ నిన్న జరిగిన సభలో పేర్కొన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మానవాడ గ్రామంలో సభకు హాజరై ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతకుముందు ఇచ్చినవి 410 అప్లికేషన్లు మరియు తర్వాత 90 అప్లికేషన్లు వచ్చినవి.1-04-2018 వరకు నిండి ఉన్న 18 సంవత్సరాల అమ్మాయిలు అబ్బాయిలు నిర్వాసితుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించారు. 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తించదని తెలిపారు.

 

Also Read : స్విమ్స్ విద్యార్థులకు ఉచితంగా భోజ‌నం

 

గ్రామంలో ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నచో మీ యొక్క అప్లికేషన్లు ఎమ్మార్వోకు గాని ఆర్డీవోకు గాని ఇవ్వగలరని తెలిపినారు. ఏమైనా అవకతవకలు ఉన్నచో మీరు మా కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇవ్వగలరు. గ్రామంలో ఇచ్చినటువంటి దరఖాస్తుల్లో ఏదైనా గ్రామంలోని వారు ఈ లిస్టులో ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు. అదేవిధంగా గ్రామ యువకులు మాట్లాడుతూ అర్హులందరికీ నష్టపరిహారం ఇవ్వగలరని మరియు ప్రభుత్వం ఇచ్చిన తేదీ ప్రకారం అందరికీ నష్టపరిహారం ఇవ్వగలరని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో శ్రీనివాస్ ,స్పెషల్ ఆఫీసర్ డిఈఓ రాధా కిషన్ ,తాసిల్దార్ నరేష్, ఆర్ ఐ రాజశేఖర్ ఎంపీటీసీ గీతారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎల్లారెడ్డి, కట్ట గోవర్ధన్ మరియు వార్డు సభ్యులు, గ్రామస్తులు యువకులు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube