అణగారిన వర్గాలకు తొలి గొంతుక జ్యోతిరావు పూలే

అణగారిన వర్గాలకు తొలి గొంతుక జ్యోతిరావు పూలే

1
TMedia (Telugu News) :

అణగారిన వర్గాలకు తొలి గొంతుక జ్యోతిరావు పూలే
టీ మీడియా, ఎప్రియల్ 12,రాయవరం: అణగారిన వర్గాల తరుపున తొలి గొంతుక ఎత్తిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలేనని ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వి అరుణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ పాల్గొని మాట్లాడుతూ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోటమాలి కూలి కి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11 వ తారీకున పూలే జన్మించారన్నారు. ఆయన తండ్రి కూరగాయలు అమ్ముకునే వారని, కాలక్రమేణా పువ్వులు అమ్మడం వలన వారి ఇంటిపేరు పూలే గా మారిందని అన్నారు. విద్యా, అంటరానితనం, వివక్షతలు, ఆర్థిక సమానత్వం కుల మత రహిత సమాజ నిర్మాణం తదితర సమస్యలపై పూలే ఎనలేని కృషి చేశారన్నారు.

Also Read : బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

దిగువ కులాల ప్రజలు సమానహక్కులను పొందడానికి సత్యశోదక్ ను ఏర్పాటు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతికోసం పనిచేసారన్నారు. మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యకోసం, వితంతువుల కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ ఎం హరికృష్ణ రెడ్డి, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మల్లేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి దేశాల శ్రీనివాస్ ఎంపిడిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube