తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా నిలవాల : కె.యస్.జవహర్

తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా నిలవాల : కె.యస్.జవహర్

1
TMedia (Telugu News) :

తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా నిలవాల : కె.యస్.జవహర్

టీ మీడియా, ఏప్రిల్29, మధిర: నియెాజకవర్గ టిడిపి కార్యాలయములో జరిగిన సమావేశములో ముఖ్య అతిధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కె.యస్.జవహర్ మాట్లాడుతూ… తెలంగాణలో టి.డి.పి పుంజుకొని బలమైన రాజకీయ శక్తిగా నిలవాలని ఆకాంక్షిస్తూ,అందుకు ప్రస్తుత సభ్యత్వ నమెాదు కార్యక్రమం నాంది కావాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వై.సి.పి పాలనతో పూర్తిగా విసిగిపొయ్యారని,ఎప్పుడు ఎన్నికలు జరిగినా టి.డి.పి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాసిరెడ్డి.రామనాధం మాట్లాడుతూ… గతములో సభ్యులుగా వున్నవారు తమ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించుకోవాలని,టి.డి.పి అభిమానులు అలాగే సానుభూతిపరులు తప్పక సభ్యత్వం స్వీకరించాలని కోరారు.రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్సి చేకూరి.

Also Read:అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం

శేఖర్ బాబు మాట్లాడుతూ పట్టణ, మండల పార్టీ భాధ్యులు డివిజన్ అలాగే గ్రామ పరిధిలో సభ్యత్వ నమెాదు కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చెయ్యాలని కోరారు.అనంతరం లాంచనంగా సభ్యత్వ నమెాదు కార్యక్రమంలోరాష్ట్రకార్యనిర్వాహకకార్యదర్సిచేకూరిశేఖర్బాబుతనసభ్యత్వాన్నిపునరుద్ధరించుకున్నారు.ఈసమావేశములోవంగాల.రామకోటి,మల్లాది.హనుమంతరావు,మార్నీడి.పుల్లారావు,మేడేపల్లి.రాణి,మైనీడి.జగన్ మరియు పట్టణ,మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read:సామాజిక రుగ్మతలకు సాహిత్యం కళలే పరిష్కారం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube