ముగిసిన కె.విశ్వనాథ్ అంతిమయాత్ర..

కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు

0
TMedia (Telugu News) :

ముగిసిన కె.విశ్వనాథ్ అంతిమయాత్ర..

-కళాతపస్వికి కన్నీటి వీడ్కోలు

టీ మీడియా, ఫిబ్రవరి 3, హైదరాబాద్ : కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని శ్మశాన వాటికలో ముగిశాయి. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఫిల్మ్‌నగర్‌ నుంచి పంజాగుట్ట వర​కు అంతిమ యాత్ర సాగింది. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం విశ్వనాథ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇక సెలవు.
పంజాగుట్ట శ్మశాన వాటికలో కె విశ్వనాధ్ పార్థీవ దేహానికి ఖననం నిర్వహించారు కుటుంబసభ్యులు. ఆయన కడసారి చూపు కోసం ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. బ్రహ్మాణ సాంప్రదాయం ప్రకారం కళాతపస్వికి అంత్యక్రియలు నిర్వహించారు.
పార్థివదేహం చూసి బోరున విలపించిన చంద్రమోహన్.
దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ పార్థివదేహం చూసి బోరున విలపించారు సీనియర్ నటుడు చంద్రమోహన్. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కళాతపస్విని చివరిచూపు చూసేందుకు వచ్చాయి. సిరిసిరిమువ్వు సినిమాతో తన కెరీర్ మలుపు తిప్పిన డైరెక్టర్ విశ్వనాథ్ పార్ధివ దేహం చూసి చలించిపోయారు. వెక్కి వెక్కి ఏడ్చారు.
నా గురువు గారు: అనిల్ కపూర్..

Also Read : 2019 నుంచి ప్రధాని 21 విదేశీ పర్యటనలు

మీతో ఎక్కువ సమయం సెట్ లో ఉండడమంటే గుడిలో దేవుడితో ఉన్నట్లే అనిపించేది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి గురువుగారు. అంటూ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్.

సమాజానికి ఆయన చక్కని సందేశం అందించారు.. తలసాని శ్రీనివాస యాదవ్..
‘విశ్వనాథ్‌గారు తీసిన చిత్రాల ద్వారా సమాజానికి చక్కని సందేశం అందించారు. ఆయన సినిమాలు చాలా మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి. ఇండస్ర్టీలో ఎన్నో జానర్ల సినిమాలొచ్చాయి కానీ.. ఆయన తీసిన సినిమాలు ప్రత్యేకం. మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు మంచి పట్టుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనది ప్రత్యేక స్థానం. ఆయన లేని లోటు తీరనిది. అంత్యక్రియలు… అధికార లాంఛనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.
సినిమా ఉన్నంతకాలం ఆయన ప్రభావం ఉంటుంది.. మహేష్ బాబు..
సంస్కృతి, సినిమాలకు అద్భుతంగా కలగలిపిన జీనియస్ కె. విశ్వనాథ్ గారు. సినిమా ఉన్నంత కాలం ఆయన ప్రభావం ఉంటుంది. విశ్వనాధ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిమ్నల్ని చాలా మిస్ అవుతున్నాం. విశ్వనాథ్ కుటుంబానికి.. ఆయనను ప్రేమించేవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

Also Read : ఏపీలో పాగా వేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు..

చంద్రబాబు తీవ్ర సంతాపం..
కళాతపస్వి విశ్వనాథ్ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.
ఇళయరాజా ఎమోషనల్..
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖ్యమైన.. ప్రధాన స్థానంలో ఉన్న డైరెక్టర్ విశ్వనాథ్. ఆయన దేవుడి పాదాల చెంతకు వెళ్లారని తెలిసి చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ వీడియో రిలీజ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube