కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

1
TMedia (Telugu News) :

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

 

టీ మీడియా, అక్టోబర్ 25, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముంత మల్లయ్య యాదవ్ సహకారంతో మంగళవారం కబడ్డీ పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను ముంత శివయాదవ్ తో కలిసి ప్రారంభించిన స్థానిక సర్పంచి వంగూరు నరసింహ రెడ్డి,ఎంపీటీసీ గుండ్లపల్లి భాస్కర్ రెడ్డి, స్థానిక ఎస్సై రామన్ గౌడు, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎత్తం బాలస్వామి, సిపిఎం పార్టీ పదో వార్డు మెంబర్ జక్కుల ఆశన్న, స్కూల్స్ హెడ్మాస్టర్లు, స్కూల్ చైర్మన్ నటరాజు, పాల్గొని టాస్ వేసి, కబడ్డీ పోటీలను ప్రారంభించారు.

Also Read : విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

తదనంతరం వారు మాట్లాడుతూ ఈ యొక్క ఉమ్మడి మహబూబ్ నగర్ కబడ్డీ టోర్నమెంట్లో 35 జట్లు పాల్గొన్నాయని, గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని, ప్రతి ఒక్కరూ రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో కూడా మీ యొక్క ప్రతిభ కనబరచాలని, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో వీపనగండ్ల మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube