కబడ్డీ పోటీలను విజయంతం చేయండి

-పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు పిలుపు

1
TMedia (Telugu News) :

కబడ్డీ పోటీలను విజయంతం చేయండి

-పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు పిలుపు

-పటేల్ స్టేడియంలో ప్రాక్టీస్ షురూ..!

 

టీ మీడియా,అక్టోబర్ 26,ఖమ్మం: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన సందర్భంగా పొంగులేటి స్వరాజ్యం రాఘవరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వారి అనుమతితో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు పిలుపునిచ్చారు. స్థానిక పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పోటీల విజయవంతం కోసం బుధవారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఇంఛార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి, ట్రస్ట్ బాధ్యులు మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య , మద్దినేని బేబి స్వర్ణకుమారి తదితరులు మాట్లాడుతూ ఈ నెల 28,29,30తేదీలలో నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో “ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రస్థాయి కబడ్డీ ఛాంపియన్ షిప్ ట్రోఫీ ‘ పేరుతో పురుషులు, మహిళలకు ఈ పోటీలు జరగనున్నాయన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన ఇరు విభాగాల వారికి మొదటి బహుమతిగా రూ.లక్ష అందజేస్తున్నట్లు వివరించారు.

 

Also Read : నిస్సహాయుల ఆశ్రమంలో పిల్లలకు టపాసుల పంపిణీ

 

తర్వాత ఏడు స్థానాల్లో నిలిచిన జట్లకు కూడా నగదు బహుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీలకు హాజరైయ్యే క్రీడాకారులకు, రిఫరీలు, కోచ్ లకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు సైతం ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. పోటీలను విజయవంతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆయా కమిటీల్లోని బాధ్యులు పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు, వీక్షకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తమ బాధ్యతలను నిర్వర్తిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె. క్రిష్టఫర్ బాబు పర్యవేక్షణలో ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేయడం జరిగిందన్నారు.

-ప్రాక్టీస్ షురూ…!

పోటీలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి పటేల్ స్టేడియానికి చేరుకున్న క్రీడాకారులు ప్రాక్టీస్ ను ముమ్మారం చేశారు. ఆయా జట్ల కోచ్ పర్యవేక్షణలో మ్యాట్లపై కబడ్డీ ప్రాక్టీస్ చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా పురుషులు, మహిళల జట్ల క్రీడాకారులు కసరత్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube