సంక్రాంతి సందర్భంగా కబడ్డీ ముగ్గుల పోటీలు
టీ మీడియా, జనవరి 16, మహబూబ్నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర క్రీడా అయినటువంటి కబడ్డీ పోటీల దేవరకద్ర మండలం వెంకటాయ పల్లి గ్రామంలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగింది.కబడ్డీలో ఆటలో గెలుపొందిన సినియర్, జూనియర్ జట్లకు బహుమతులు, మెడల్స్ అందజేసారు. ఈ సందర్బంగా క్రీడాకారులు మాట్లాడుతూ ప్రతి సంక్రాతి పండగ సందర్బంగా మన గ్రామంలో కబడ్డీ,ముగ్గుల పోటీలు నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు.ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించి, ప్రతిభ గల క్రీడాకారులను వెలికితిస్తున్న గ్రామ యూత్ సభ్యులకు అభినందనలు తెలియజేసారు.భవిష్యత్తులో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.