తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

0
TMedia (Telugu News) :

తెలుగు దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

టీ మీడియా, ఫిబ్రవరి 3, హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి, దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. లెజెండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ సినీ పరిశ్రమకు ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. సామాజిక సమస్యలు, సాంఘిక దురాచారాలను సునిశితంగా విమర్శిస్తూ చిత్రాలు రూపొందించిన కె విశ్వనాథ్.. తన సినిమాల్లో ప్రధానంగా కళలకు పెద్ద పీట్ వేశారు. ఆయన తెరకెక్కించిన మెజారిటీ చిత్రాలు కళలకు సంబంధించినవే. ఆయన చెప్పాలనుకున్న కథకు సంగీతం లేదా నృత్యాన్ని జోడించి అందమైన దృశ్యరూపంగా మలచడంలో ఆయనకు ఆయనే సాటి. ‘శంకరాభరణం, సాగర సంగమం, సిరి సిరి మువ్వ, స్వర్ణ కమలం’ తదితర చిత్రాలు ఈ కోవకు చెందినవే. కొద్ది రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో కె.విశ్వనాథ్ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే, గురువారం అర్ధరాత్రి సమయంలో కె.విశ్వనాథ్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెద పులివర్రు అనే గ్రామంలో 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని విశ్వనాథ్ జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్య పెదపులివర్రులోనే గడిచినా ఆ ఊర్లో ఎక్కువ రోజులు నివసించలేదు. విశ్వనాథ్ పాఠశాల విద్య అంతా విజయవాడలో చేశారు.

Also Read : ఆశా వర్కర్ల డిమాండ్లను బడ్జెట్ సమావేశంలో పరిష్కరించాలి

గుంటూరు హిందూ కాలేజీ, ఏసీ కాలేజీల్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. బీఎస్సీ డిగ్రీ పట్టా తీసుకున్నారు.అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తోడికోడళ్లు అనే సినిమాకు పనిచేస్తున్నపుడు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడి ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతో విశ్వనాథ్ దర్శకుడిగా మారారు. ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది. కె విశ్వనాథ్ మొత్తం 60 సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగరసంగమం, స్వర్ణకమలం, సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎన్నో క్లాసిక్స్ అందించారు. అలాగే, నటుడిగానూ ఎన్నో గొప్ప పాత్రల్లో కె.విశ్వనాథ్ జీవించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube