కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు:కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు:కేంద్రం

1
TMedia (Telugu News) :

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు:కేంద్రం

టి మీడియా,జులై22,ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈమేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2016, 2018లో సీఎం కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కోరారని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు.

 

Also Read : మొక్కులు చెల్లించిన ముదిరాజ్ లు

 

అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్‌ స్టీరింగ్‌ కమిటీ పరిశీలించాలి, హై పవర్‌ కమిటీ అనుమతిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తిశాఖ స్పష్టం చేసింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube