కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మణీయం : మంత్రి జగదీష్‌ రెడ్డి

కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మణీయం : మంత్రి జగదీష్‌ రెడ్డి

1
TMedia (Telugu News) :

కల్నల్ సంతోష్ బాబు త్యాగం చిరస్మణీయం : మంత్రి జగదీష్‌ రెడ్డి
టి మీడియా,జూన్15 సూర్యాపేట : దేశ కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుచరిత్రలోనే చిరస్మరణీయుడిగా నిలిచి పోతారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన యుద్ధంలో అసువులు బాసిన మహావీరచక్ర దివంగత కల్నల్ సంతోష్ బాబు రెండో వర్ధంతి సందర్భంగా సంతోష్ బాబు చిత్రపటానికి మంత్రి ఘన నివాలులర్పించారు.

Also Read : కర్షకుల సేవలో వ్యవసాయ మార్కెట్ బేష్

కాసరబాద్ రోడ్డులోని స్మృతి వనంలొ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంతోష్ బాబు విగ్రహాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సంతోష్ బాబు మరణానంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయ సందేశం ఇతర రాష్ట్రాల తో పాటు యావత్ భారతదేశానికి స్ఫూర్తివంతమైన సందేశాన్ని టి మీడియా,జూన్15, చేరవేసిందన్నారు.ఆర్మీలో పనిచేసే ప్రతి ఒక్కరికి రేపటి రోజున వారి కుటుంబాలకు భారత ప్రజలు అండగా ఉంటారు అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సహాయానికి సందేశం అని ఆయన చెప్పారు.

Also Read : క్రీడాకారిణి కి మంత్రి అభినందన

కార్యక్రమంలో సంతోష్ కుమర్ భార్య సంతోషి, కుటుంభ సభ్యులతో పాటు మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత, జడ్పీటీసీ జీడి భిక్షం, రాష్ట్ర టీఅర్ఎస్ కార్యదర్శి వై.వీ, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube