కల్తీ కల్లుతో ఆరోగ్యానికి చిల్లు

కల్తీ కల్లుతో ఆరోగ్యానికి చిల్లు

1
TMedia (Telugu News) :

కల్తీ కల్లుతో ఆరోగ్యానికి చిల్లు                                                                                                                     -ఎక్కువ మోతాదు లో క్లోరల్ హైడ్రేట్ వినియోగం
– జోరుగా సాగుతున్న విక్రయాలు                                                                                                                 -కోట్లు సంపాదిస్తున్న కాంట్రక్టర్లు

 టీ మీడియా,డిసెంబర్ 3,ప్రత్యేక ప్రతినిధి :స్వచ్ఛమైన కల్లుకు ఉమ్మడి నల్గొండ , ఖమ్మం జిల్లాలో ప్రసిద్ధి. కానీ ప్రస్తుతం కల్తీ కల్లు విషం చిమ్ముతోంది. కల్లును కల్తీ చేయడంతో దానికి అలవాటు పడిన వారు అనారోగ్యం పాలవుతున్నారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.ఆల్ఫాజోలోం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ వంటి రసాయనాలు కలిపి కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇది చాలా ప్రమాదకరం అని తెలిసినా కల్లు వ్యాపారులు వీటినే వాడుతూ కల్లును తయారు చేస్తూ విక్రయిస్తున్నారని అంటున్నారు. అడపాదడపా దాడుల్లో పెద్ద ఎత్తున కల్లులో కల్తీ చేసే పదార్దాలు లభ్యమవుతుంటే.. నిత్యం నిఘా పెడితే ఇంకా పరిస్ధితి ఎలా ఉంటుందోనన్న అనుమానాలు స్ధానికులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కల్లుతాగే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేదు. తక్కువ ఉత్పత్తి.. ఎక్కువ డిమాండ్ ఉండటంతో నిషేధిత కల్తీ కల్లుకు తయారీకి మొగ్గు చూపుతున్నారు.

కోటి పరిహారం ఇవ్వాలి

రెండేళ్ల కింద నకిరెకల్‌లో ఓ ఇంట్లో ఏకంగా 500 కేజీల కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే మెటీరియల్‌ను సీజ్ చేశారు. ఆపై నార్కట్‌పల్లిలోనూ ఓ ఇంట్లో 600 కేజీల కల్లు తయారీ మందు సీజ్ చేయడం అప్పట్లో కలకలం రేపింది.తాజాగా కల్తీ కల్లు మందు క్లోరల్ హైడ్రేట్ రవాణా చేస్తూడంగా.. ఎక్సైజ్ ఎన్ఫోర్మ్మెంట్ అధికారులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నార్కట్‌పల్లి తుమ్మలగుడానికి చెందిన ఓ వ్యక్తి కారులో 150కిలోల మత్తు మందు రవాణా చేస్తూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మ్ంట్ టీంకి పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కల్తీ కల్లు తయారు చేసినా అమ్మినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నల్గొండ నుంచి జీవన వృత్తిలో భాగంగా సూరత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా లాంటి ప్రాంతాలకు వెళ్లి కల్లు చేస్తుంటారు. కొంత ఆదాయం సంపాదించుకుని తిరిగి సొంత ప్రాంతాలకు వస్తుంటారు. అయితే నల్గొండ జిల్లాలో తక్కువ మొత్తంలో కల్లు వచ్చినప్పడు, కల్తీ కల్లుపై దృష్టిపెడుతుంటారు. కల్తీ కల్లు తయారీలో వేసే క్లోరల్ హైడ్రేట్ ఎక్కువ మోతాదులో వేస్తే హార్ట్ బీట్ స్లో అవుతుందని, నరాల బలహీనత ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.కల్తీ కల్లు నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈత, తాటి వనాలను ఏర్పాటు చేస్తుంది. దీనిని సద్వనియోగం చేసుకోవాలని అప్పుడే కల్తీ కల్లుపై ఉక్కపాదం మోపగలరని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అమ్మకం జోరుగా .. నగరం లోకృతిమ కల్లు అమ్మకం జోరుగా ఉంది.

సమంత మహానటి స్థాయికి వెళ్లగలదన్న సురేశ్‌బాబు.. 

ఈ కల్లుకు యవత బానిస అవుతున్నారు.నివాసాల మధ్య దుకాణాలు పెట్టి యథేచ్ఛగా అమ్ముతున్నారుకాంట్రాక్టర్లు కోట్లకు పరుగెడుతున్నారు.ఏ ఒక్క దుకాణానికి బోర్డు ఉండదు.ఇక్కడ జరిగే అమ్మకలకు లెక్కలుఉండవు,ఖమ్మం నగరం లో విద్య,వైద్య శాల ల వద్ద అక్రమ కల్లు దుకాణాలుఉన్నాయి.అధికారులు ఎవరు అటువైపు కన్నెత్తిచూడరు. ఈ కల్లు సోసైటీ నిర్వహణ ,సభ్యులు లో కూడా బోగస్ వ్యవహారంఉంది. పరిసలనలో అనేక అక్రమాలు వెల్లడి అయ్యాయి.ఈ ఆకారం వ్యాపారంలో కీలకం ఉన్న వ్యక్తి కోటి రూపాయల తో నగర శివార్ల లోనిర్మాణం చేస్తున్నారు.కల్లు అక్రమ వ్యాపారం సంపాదన చేర్చ ఉంది.(మరి కొన్నివివరాలు మరో కధనం లో)

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube