కల్వ కుంట్ల రాజ్యాంగం అమల్లో ఉంది

టీ మీడియా, మార్చ్ 9, మెదక్

1
TMedia (Telugu News) :

కల్వ కుంట్ల రాజ్యాంగం అమల్లో ఉంది

టీ మీడియా, మార్చ్ 9,
మెదక్ :
మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ గుప్త మెదక్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతుందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గుప్త మండిపడ్డారు. బుధవారం నాడు భాజపా శాసనసభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ నిరసిస్తూ జిల్లా కేంద్రం మెదక్ పట్టణం రాందాస్ చౌరస్తా వద్ద రాజ్యాంగ రక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యేల పై విధించిన సస్పెన్షన్ బేషరతుగా ఎత్తివేయాలని రేపటి నుంచి వారిని అసెంబ్లీకి అనుమతించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏరాష్ట్రంలో జరగనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానపరుస్తున్నాడని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ ప్రారంభం అవుతున్న సందర్భంలో ఆనవాయితీగా గవర్నర్ ప్రసంగం ఉండాలి, కానీ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ ను ప్రవేశపెట్టడం హేయమైనచర్య అన్నారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ లోటుపాట్లను ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తారని ఉదేశ్యపూర్వకంగానే వారిని సస్పెన్షన్ చేసారన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్నీ అంతమోదించి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.

Also Read :  పోలీసు అభ్యర్థులకు ఉచిత శిక్షణ

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్‌ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్షులు నల్లాల విజయ్‌ కుమార్, బానప్ప గారి సుదాకర్ రెడ్డి, సంఘసాని సురేశ్, జిల్లా ఉపాద్యక్షులు సత్యపాల్ రెడ్డి, వనపర్తి వెంకటేశం, నంద రెడ్డి, మోర్చా జిల్లా అధ్యక్షులు ఉదయ్‌ కిరణ్, బెండె వీణ, పాపగారి రమేష్ గౌడ్, వాల్దాస్ మల్లేష్ గౌడ్, కరణం గణెష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బక్కవారి శివ, జిల్లా నాయకులు ఎక్కల దేవి మధు, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్ , కల్కి నాగరాజు, ఎమ్ ఎల్ ఎన్ రెడ్డి, వడ్ల జనార్దన్‌, గోవింద్, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube