కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే

– చామకూర మల్లారెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 19, జవహర్నగర్ : కళ్యాణలక్ష్మి పథకం ప్రతి నిరుపేద ఇంట్లో ఆనందం నెలకొందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జవహర్ నగర్ కార్పొరేషన్ తహశీల్దార్ మీటింగ్ హాల్లో తహశీల్దార్ మతిన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చలు మరింత అభివృద్ధి చేసి ఉత్తమ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతామని అన్నారు. జవహర్ నగర్ నా గుండెకాయలాంటిదని, జవహర్ నగర్ ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం 20మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

Also Read : వంట వార్పు నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తలు

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ శ్రీలక్ష్మి, కార్పొరేటర్లు జిట్టా శ్రీవాణిశ్రీనివాస్ రెడ్డి లావణ్యసతీష్ గౌడ్, సతీష్ కుమార్, శారదామనోధర్రెడ్డి, పల్లపు రవి, లక్ష్మి, చిత్రాసుబ్రమణ్యం, శాంతికోటేష్ గౌడ్, నిహారికగౌడ్, కోఆప్షన్సభ్యులు, సీనియర్ నాయకులు మెట్టు వెంకన్న, సింగన్న బాల్రజ్, ఆహ్మద్వాషా, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube