కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

31 చెక్కులకు గాను రూ.31 లక్షల పంపిణీ

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
-31 చెక్కులకు గాను రూ.31 లక్షల పంపిణీ.
టీ మీడియా,జూన్ 29, ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 31 మందికి చెక్కులకు గాను రూ.31 లక్షల విలువైన చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా పంపిణీ చేశారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.

Also Read : దళిత బంధు అమలు చేయడం చారిత్రాత్మకం

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ గారు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు , జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, MRO శైలజ కార్పొరేటర్ లు కమర్తపు మురళి గారు, రుద్రగాని శ్రీదేవి, తోట దనమ్మ, సరస్వతి, నాయకులు బొమ్మెర రాంమూర్తి , చైర్మన్ లక్ష్మిప్రసన్న తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube