ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్

ఎమ్మెల్యే దివాకర్ రావు

2
TMedia (Telugu News) :

ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్
-ఎమ్మెల్యే దివాకర్ రావు

టి మీడియా ,మే 25, లక్షెట్టిపేట:

ఆడబిడ్డలకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ను అందిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఐబీ విశ్రాంతి భవనంలో 79 మంది లబ్ధిదారులకు స్థానిక నాయకులతో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గమనించాలని కోరారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్,ఆసరా, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య, 83 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కొందరు ప్రతిపక్ష నాయకులు గుండాయిజం, రౌడీయిజంతో రాజకీయాలు చేయాలని చూడటాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. పేకాట క్లబ్ లు, గంజాయి లాంటి చెడు అలవాట్ల వైపు యువత వ్యసనపరులు కాకుండా ఉండేదుకే సీఎం కేసీఆర్ క్లబ్ లను బంద్ చేశారన్నారు.

Also Read : అంధకారంలో అబ్బీపురం గ్రామంలోని గిరిజన కాలనీ

ముఖ్యంగా లక్షెట్టిపేట్ లో విద్యా సంస్థలను నెలకొల్పి ఎడ్యుకేషన్ హబ్ గా మార్చి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచామన్నారు. ప్రతి విద్యార్థి పై ప్రభుత్వం ఏడాదికి రూ. 80 వేలు ఖర్చు చేస్తుందని వివరించారు. నాయకులకు జవాబు దారీతనం అవసరమని, ప్రజలకు బాధ్యత వహించే నాయకులను ఆదరించాలని కోరారు. ప్రజల ఆదరాభిమానాలను పొందేలా పనులు చేయాలన్నారు. అహంకారం, గుండాయిజం ప్రతిపక్ష నాయకులు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. విమర్శలు చేసేందుకు కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్,నాయకులు పాదం శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డి,షాహిద్ అలీ, సర్పంచ్ లు సొల్లు సురేష్, రాగుల రాజేశం,గోళ్ళ రవీందర్,బానోత్ జయంత్, కౌన్సిలర్లు సురేష్ నాయక్,రాందేని వెంకటేష్, పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube