పీఠాలు,మఠాలు నిర్వహణ లోని – కల్యాణ మండపాలు కిరాయి రెట్లు ప్రదర్శించాలి,ప్రకటించాలి

పీఠాలు,మఠాలు నిర్వహణ లోని - కల్యాణ మండపాలు కిరాయి రెట్లు ప్రదర్శించాలి,ప్రకటించాలి

0
TMedia (Telugu News) :

పీఠాలు,మఠాలు నిర్వహణ లోని

– కల్యాణ మండపాలు కిరాయి రెట్లు ప్రదర్శించాలి,ప్రకటించాలి

– దర్మధికారుల వివరాలు బహిర్గత పర్చలి

-అఖిల భారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్

టి మీడియా,మే3,ఖమ్మం:నగరం తో పాటు తెలుగు రాష్ట్రాల లోని మఠాలు,పీఠాలు అధ్వర్యంలో నిర్వహి స్తున్న కల్యాణ మండపాలు రోజువారీ కిరాయి, విద్య సంస్థలు లలో ఫీజులు తోపాటు,దర్మధికారులు,సిబ్బంది వివరాలు బహిర్గతం చెయ్యడం తో పాటు, సమందిత కేంద్రం వద్ద అందరికీ కనిపించే విధంగా చార్ట్ లు ఏర్పాటు చెయ్యాలి అని అఖిలభారత బ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ ప్రతినిధి శనగపాటి మురళి కృష్ణ డిమాండ్ చేశారు.దేవాదాయ శాఖ వివరాలు వెల్లడికి చర్యలు తీసుకోవాలని కోరారు.హిందుత్వం,ఆచారాలు,ఆపచారాలు అని నోరు పారేసుకొనే వారు ఈ విషయం లో నోరు మెదపక పోవడం అక్కడ జరుగుతున్న అక్రమాల్లో వారి కి వాటాలు ఉన్నయి అనేది స్పష్టం అవుతోంది అన్నారు.                         

 

also read:వేదాలు విజ్ఞాన భాండాగారాలు

 

మతం పేరు చెప్పి,రాములోరి పేరుచెప్పి రాజకీయం చేసేవారు ఎందుకు అడగరు అన్నారు.ఖమ్మం నగరం లోని రెండు పీఠాలు కు సమందించిన ధర్మధికారులు కాలం చేశారు.వారి స్థానం లో ఎవరు నియమితులు అన్నది స్పష్టత లేదు.దేవాదాయ శాఖ నుండి పర్యవేక్షక అధికారి వివరాలు బహిర్గతం కావు. పీఠానికి చెందిన కల్యాణ మండపం సామాన్యులు కు అందుబాటులో లేదు.1.50 లక్షలు చెల్లించి నట్లయితే నే అక్కడ కార్యక్రమం నిర్వహణ కు అనుమతి.ప్రవచన కేంద్రము అని బోర్డ్ పెట్టారు.ఎప్పుడు ,ఎక్కడ ప్రవచనాలు ఎవరితో చెప్పించారు తెలియదు.అనధికార వ్యక్తులు అక్కడ పెత్తనం చేస్తారు.పెళ్లి చేసుకొనే వారు డెకరేషన్ చేయించు కోవాలి అంటే, నిర్వాహకులు గా చెప్పుకునే అనధికార వ్యక్తులు సూచించిన వారి తోనే వారు కోరినంత చెల్లించి వినియోగించు కోవాలి

 

also read :మద్యం సేవించేవారిలో కాలేయ సమస్యలు

అనధికార వాహనాలు పార్కింగ్,ఫర్నిచర్ షాప్ వారి కి స్టాక్ రూమ్ గా సెలార్ మారింది.వివరాలు తెలుసు కావాలి అంటే అనధికారిక వ్యక్తులు సెల్ నెంబర్ల దర్శనం ఇస్తాయి.ఇట్లాంటి అనేక అవక తవకలు తెలుగు రాష్ట్రాల లోని పలు చోట్ల ఉన్నయి.వీరికి నాయకులు గా చెప్పుకోవడానికి సంఘాలు పెట్టు కొన్న వారి సహకారం ఉంది అని అన్నారు..జీర్ణ,చిన్న దేవాలయాల లో అర్చకులు అర్ధాకలితో అలమటిస్తుంటే,పీఠాలు,మఠాలు పేరుతో కొంతమంది దేవాలయాలు అభివృద్ధి పేరుతోకబ్జా చేసి లగ్జరీ భవనాలు నిర్మాణం చేసి దైవ కార్యక్రమం ముసుగులో కార్పొరేట్ వ్యాపారం కు తెర లేపిఅపరకుబేరులుమారి.తమకు సహకరిస్తున్న వారికి కుక్కకు బిస్కట్లు వేసినట్లు వేస్తున్నారు అన్నారు. ఇటువంటి అక్రమాలు పై అధికారులు చర్యలులేకపోతేఅఖిలభారతబ్రాహ్మణ(సర్వీస్)నెట్వర్క్ విస్తృత క్యాంపెయిన్ చేస్తుంది అని శనగపాటి స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube