కన్నుల పండువగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి కల్యాణోత్సవం
కన్నుల పండువగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి కల్యాణోత్సవం
కన్నుల పండువగా శ్రీ లక్ష్మినరసింహ స్వామి కల్యాణోత్సవం
లహరి, ఫిబ్రవరి 4, హైదరాబాద్ : తెలుగు కల్చరల్ అసోసిషన్ వారి ఆధ్వర్యంలో శనివారం మెల్‌బోర్న్‌లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణమహోత్సవం శ్రీ రాఘవేంద్ర మఠం మురాంబీన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కల్యాణంలో మెల్‌బోర్న్‌వాసులతో పాటు తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ ఈవో గీతా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహించి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణము అత్యద్భుతంగా జరిగిందని వెల్లడించారు. తెలుగువారు స్వదేశానికి వచ్చిన సందర్భంగా యాదాద్రి స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం మెల్‌బోర్న్‌లో కల్యాణం ఏర్పాటు చేసిన ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ విక్టోరియా వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.